ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రతి వార్డులో వీధి కుక్కలు, కోతులు గుంపులుగా తిరుగుతూ ప్రజలకు భయానక పరిస్థితులు సృష్టిస్తున్నాయని, చిన్నపిల్లలపై దాడులు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అగల్ దివిటీ, మాజీ సర్పంచ్ బత్తిని రాజేష్, ప్రధాన కార్యదర్శి దేవేందర్, ఉపాధ్యక్షులు కుచులకంటి శంకర్, శ్రీను, వంగపల్లి కాశీనాథ్, సీనియర్ నాయకుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.
Latest News
