దేవాదాయశాఖ భూములు ఆక్రమిస్తే కఠిన శిక్షలు
అమరావతి:రాష్ట్రంలో దేవాదాయశాఖ ఆస్తుల అక్రమ ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూమత సంస్థలు, ఎండోమెంట్స్ చట్టం–1987కి సవరణలు చేసి ఆర్డినెన్స్ జారీచేసింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ప్రధాన అంశాలు:లీజు లేదా లైసెన్సు గడువు ముగిసిన తర్వాత కూడా భూమి వదలకపోతే ఆక్రమణగా పరిగణిస్తారు.అధికారులు 7 రోజుల ముందే నోటీసు జారీ చేసి ఖాళీ చేయాలన్న డిమాండ్ చేయవచ్చు.భూమి అప్పగించకపోతే నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసి పోలీస్ సహకారంతో సీజ్ చేస్తారు.3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు. ఆక్రమణకు సంబంధించి ఏ రకమైన దస్తావేజులు చూపినా చెల్లుబాటు కాదు.దేవాదాయ ఆస్తుల్లో అనధికార నిర్మాణాలు చేపట్టవద్దు.నోటీసు తర్వాత 15 రోజుల్లో ఎండోమెంట్ ట్రైబ్యునల్కి అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. అప్పీల్ పెండింగ్లో ఉన్నా అద్దె లేదా సంబంధిత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో దేవాదాయ శాఖ భూసమస్యలకు పరిష్కారం ఆశిస్తున్నారు.