గిరిజనులకు ఇందిరా సౌర గిరిజల వికాస పథకం ఎంతో తోడ్పడుతుంది.
– జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూలై 2
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన ఇందిర సౌర గిరిజల వికాసం పథకం పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలను కలిగి పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనుల పంట భూములను లాభసాటి వ్యవసాయానికి అనుకూలంగా మలిచేందుకు ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో గిరిజన పోడు పట్టాలు పొందిన లబ్ధిదారులకు బోరు మోటర్, సోలార్ పంప్ సెట్లు మంజూరు చేసి వాటిని వినియోగంలోకి తీసుకువచ్చి వాటి ద్వారా కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసుకుని అభివృద్ధి చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఈ పథకము కొరకు సంబంధిత మండల అభివృద్ధి అధికారి కార్యాలయము నందు దరఖాస్తు చేసుకోవలసినదిగా తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి భోగా నికిత అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చందర్ నాయక్, కామారెడ్డి ఆర్డిఓ వీణ, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సతీష్ యాదవ్, డి ఆర్ డి ఓ సురేందర్, డిపిఓ మురళి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ఉద్యానవన అధికారి జ్యోతి, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యుత్ శాఖ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.