జిల్లాలో పది మంది ఎస్సైలకు స్థానచలనం
— జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం)జూన్ 3
కామారెడ్డి జిల్లాలో పది మంది ఎస్ఐలను బదిలీలను చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.నవీన్ చంద్ర, ప్రస్తుతము విధులు నిర్వహిస్తున్నది. బిచ్కుంద,వారికి జుక్కల్ పోస్టింగ్ ఇవ్వగా,
టి.రాఘవేంద్ర కామారెడ్డి రూరల్ ఎస్సైగా ఎదురు నిర్వహిస్తున్న వారిని నసురుల్లాబాదుకు బదిలీ చేశారు.ఏ అరుణ్ కుమార్ ఎల్లారెడ్డి ఎస్సైగా ఉండగా, ప్రస్తుతం పెద్ద కొడంగల్ ఎస్ఐగా బాధ్యతలు అప్పగించారు,టి. లావణ్య నసురుల్లాబాద్ ఎస్సైగా పనిచేస్తుండగా,వారికి రామారెడ్డి ఎస్ఐగా బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం ఎస్. రాజారామ్ రామారెడ్డి ఎస్సైగా పనిచేస్తుండగా, కామారెడ్డి టౌన్ ఎస్సైగా బాధ్యతలు అప్పగించారు.పుష్ప రాజ్ రాజంపేట ఎస్ఐ గా విధులు నిర్వహిస్తుండగా,సదాశివ నగర్ ఎస్సైగా బాధ్యతలు అప్పగించారు,బి.రంజిత్ సదాశివ నగర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తుండగా,వారిని దేవునిపల్లి ఎస్సైగా పోస్టింగ్ ఇచ్చారు. భువనేశ్వర్ జుక్కల్ ఎస్సైగా విధులు నిర్వహిస్తుండగా దేవునిపల్లి ఎస్సై -2 గా నియమించారు,జి. రాజు దేవునిపల్లి ఎస్సైగా విధులు నిర్వహిస్తుండగా కామారెడ్డికి వి ఆర్ గా అటాచ్ చేశారు. మహేందర్ పెద్ద కొడంగల్ ఎస్సైగా విధులు నిర్వహిస్తుండగా కామారెడ్డికి వి ఆర్ అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. వారి వారి విధుల్లో చేరాలని ఆదేశించారు.