నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన న్యూ మిలీనియం స్కూల్ విద్యార్థి

*నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన న్యూ మిలీనియం స్కూల్ విద్యార్థి*

*విద్యార్థిని అభినందించిన పాఠశాల చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి*

*జమ్మికుంట జులై 3 ప్రశ్న ఆయుధం*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పట్టణంలో నిర్వహించిన నృత్య పోటీల్లో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం స్కూల్లో చదువుతున్న మేకప్ సరయు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థాయిలో బహుమతి పొందడం అభినందనీయమని పాఠశాల చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం హై స్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్న మేకప్ సరయు నృత్య ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనపరచుండడంతో రాష్ట్రస్థాయి హిందూ ప్రచార వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పట్టణంలో నిర్వహించిన నృత్య పోటీలలో తన సత్తాను చాటి అత్యుత్తమ ప్రతిభను కనబరిచి మొదటి స్థాయిలో బహుమతి సాధించడం అభినందనీయమని పాఠశాల చైర్మన్ ఉపాధ్యాయులు పేర్కొన్నారు సరయు ఇటు చదువులోనూ ఎప్పుడూ ముందు వరుసలో ఉండేదని తనకు చిన్నప్పటినుండి అలనాటి ప్రాచీన కల ఆయినటువంటి కూచిపూడి నాట్యాన్ని పట్టణంలోని జోషిక నాట్య కళాక్షేత్రం గురువు బాధెల స్వప్న వద్ద నేర్చుకొని రాష్ట్రస్థాయిలో తన ప్రతిభను కనబరిచి కన్న తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావడం శుభసూచకమని భవిష్యత్తులో బాలిక మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమెలోని కళా నైపుణ్యాన్ని గుర్తించి ఆమెను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పి విశ్వనాథరెడ్డి ఉపాధ్యాయ బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now