**బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగారం బీజేపీ నాయకులు**
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూలై 3
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ను నాగారం ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సురేష్, శ్యామ్‌సుందర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, రవీందర్ రెడ్డి, అకాల సురేష్, ముద్రగణం శ్రీనివాస్ యాదవ్, కొడిమాల కొండల్ రెడ్డి, నరేష్, వెంకటేశ్వరరావు, వేణు వంటి ప్రముఖ బీజేపీ నేతలు కూడా రాంచందర్‌ను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.
నాగారం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు జ్యోతి పాండే, కృష్ణవేణి సహా పలువురు మహిళా నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టిన రాంచందర్‌కు అందరూ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్బంగా స్థానిక నాయకులు రాష్ట్ర అధ్యక్షుడితో పార్టీ విస్తరణ, బూత్ స్థాయిలో బలమైన కమిటీలు, మహిళల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.