కామారెడ్డి లో ముమ్మరంగా పారిశుద్ధ పనులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూలై 5
కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలో ముమ్మరంగా పారిశుద్ధ పనులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ శానిటరీ అధికారి, శనివారం పలు డ్రైనేజీలను శుభ్రం చేయించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అశోక్ నగర్ కాలనీలో, డ్రైనేజీల్లో చెత్త చేరి కొద్దిపాటి వర్షానికి వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో శనివారం కామారెడ్డి మున్సిపల్నిశానిటరీ అధికారి ఫర్వేజ్,మున్సిపల్ కార్మికులతో చర్చి రోడ్ గల డ్రైనేజీలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా సానిటరీ అధికారి పర్వీజ్ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రతి కాలనీలో డ్రైనేజీలను శుభ్రం చేయించడం జరుగుతుందన్నారు.