*శ్రీకనకదుర్గా కాళీమాతా ఆలయంలో వైభవంగా జరిగిన వారాహిదేవి నవరాత్రులు..*
*ప్రశ్న ఆయుధం,జులై 05, శేరిలింగంపల్లి,ప్రతినిధి*
శ్రీ కనక దుర్గా కాళీ మాతా ఆలయంలో తొమ్మిది రోజులుగా వారాహిదేవి నవరాత్రుల ఉత్సవం ను ఆలయ ప్రధాన అర్చకులు సందీప్ మహరాజ్ ఆలయ కమిటీ చైర్మన్ బండారు వినయ్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో నాని పంతులు మార్గ దర్శనంలో భక్త మహాశయులచే వైభవోపేతము గా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తో ముగిసిన వారాహి దేవి నవ రాత్రుల కార్యక్రమం అనంతరం శనివారం రోజున అమ్మ వారి భక్తులు పల్లకి సేవా కార్యక్రమాలు కన్నుల పండుగ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సందీప్ మహరాజ్, ఆలయ కమిటీ చైర్మన్ బండారు వినయ్ ముదిరాజ్, జనరల్ సెక్రెటరీ బి.ఎస్.ఎన్ సాయి , జనరల్ సెక్రటరీ శ్రావణ్ నాయుడు, బండారి మనోహర్ రాజ్, స్వామి, సురేష్, రవి, శ్రీకాంత్ యాదవ్,అనోక్, నవీన్, తేజ, మన్నే ప్రకాశ్, సాయి ఆదిత్య లతో పాటు నాని పంతులు భక్త మహాశయులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.