అర్హులైన కళాకారులకు పింఛన్లు: మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలకు కళారూపాలతో జీవం సోసి భావితరాలకు అందిస్తున్న వృద్ధ కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, కళాకారులు సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం ఆద్వర్యంలో పలువురు కళాకారులు మంత్రి జూపల్లిని కలిసారు. అర్హులైన వృద్ధ కళాకారులకు పింఛన్ మంజూరు చేయాలని, ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని, హెల్త్ కార్డులు అందించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పెన్షన్ ఇచ్చే అంశాన్ని పరిశీస్తున్నామని, దీనిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరువలేనిదని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.