మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ వర్ధంతి నిర్వహణ

మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ వర్ధంతి నిర్వహణ

 

నిజామాబాద్ జిల్లా కోటగిరి

(ప్రశ్న ఆయుధం) జులై 6

 

నిజాంబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం, వద్ద జిల్లా ఎమ్మార్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపుర్ కే. పోచిరాం ఆధ్వర్యంలో ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ వర్ధంతి ని నిర్వహించారు. యువర్ దంతని పురస్కరించుకొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం. జగ్జీవన్ రామ్ అమర్ హే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కే. పోచీరాం మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అని ఆయన పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలో నడుస్తూ,ఆయన ఆశలు నెరవేర్చాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, జిల్లా డిసిసి డెలికేట్ కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, ఎత్తోండ మాజీ సర్పంచ్ వాగ్మారే ఆనంద్, కోటగిరి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు హాస్గుల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు హాస్గులా రవి, బోధన్ ఎమ్మార్పీఎస్ నాయకులు నర్సింలు, ఉపాధ్యాయులు ఎస్ సాయిలు, సుంకిని చందర్,హస్గుల విజయ్, హస్గులా లాలయ్యా, సుంకిని లాలయ్య,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now