నాగారం: శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి – పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం

*నాగారం: శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి – పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం*

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ ప్రశ్న ఆయుధం జులై 6

జనసంఘ్ వ్యవస్థాపకులు, నేటి భారతీయ జనతా పార్టీకి మౌలిక శిల్పి అయిన శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నాగారంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి ప్రశాంతి మేడం ఆధ్వర్యంలో, అరుణశ్రీ ముత్తయ్య సారథ్యంలో ప్రగతి నగర్ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు కౌకుట్ల చంద్రారెడ్డి, జిల్లా నాయకులు డొంకెన రవీందర్ గౌడ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు తోట నరేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, మహిళా మోర్చా సభ్యులు, స్థానిక సోదరీమణులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతగా భావిస్తూ, మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now