బీబీపేట కళాశాలకు కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ అందజేసిన తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి

బీబీపేట కళాశాలకు కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ అందజేసిన తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి

 

 

– కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్ (ప్రశ్న ఆయుధం) 10/7/25

 

 

బిబిపేట మండలంలో గల ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ స్కానర్ ప్రింటర్ అవసరం ఉదని బివిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల సాధన సమితి సభ్యులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డినీ కోరగా కోరింది తడవుగా ఎస్ ఆర్ ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ను గురువారం ఎస్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు మాజీ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో బీబీపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులకు అందించారు. అనంతరం

వారు మాట్లాడుతూ భవిష్యత్తులో కళాశాల తమ సహాయ సహకారాలు ఉంటాయని తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారని వారు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు, కళాశాల సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ.. అడిగిన వెంటనే సహకార అందించిన సుభాష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిబిపేట్ మాజీ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, జనగామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, అశోక్ గౌడ్, డా. తంగళ్ళపల్లి సంతోష్ గౌడ్, దేవునిపల్లి దేవరాజ్, కళాశాలలు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now