*ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో రక్తం అందజేత..
*రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న చిరంజీవి,శైలేష్..
*ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సరోజ(56) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రవేట్ వైద్యశాలలో ఆపరేషన్ ఏ పాజిటివ్ రెండు యూనిట్ల రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణ ను సంప్రదించడంతో సాయి వెంటనే స్పందించి తెలంగాణ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న శైలేష్,చిరంజీవి వారి సహకారంతో రక్తాన్ని ఇండియన్ రెడ్డి క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ అందజేయడం జరిగిందని ఐవి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు వారికి కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని,కుటుంబ సభ్యులు కూడా రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు.రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతలు శైలేష్ చిరంజీవి లకు,సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణకు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అభినందనలు తెలియజేయడం జరిగింది.