*ఘనంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు*
*నిర్వహించిన బిజెపి మైనార్టీ మోర్చా నాయకులు*
*కరీంనగర్ జూలై 11 ప్రశ్న ఆయుధం*
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బిజెపి మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల ఈద్గా వద్ద కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ మాట్లాడుతూ కార్పొరేటర్ నుండి కేంద్రమంత్రి స్థాయి వరకు బండి సంజయ్ కుమార్ అంచెలంచలుగా ఎదిగారని , ఆయన రాణించిన విధానం ప్రతి ఒక్కరికి మార్గ నిర్దేశనం లాంటిదన్నారు.క్రమశిక్షణ, పట్టుదల తో కరీంనగర్ పట్టణంలో జిల్లా లో పార్టీ బలోపేతం కోసం బండి సంజయ్ కుమార్ అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా ప్రజల ఆశీస్సులతో రెండు పర్యాయాలు ఎంపీగా గెలుపొంది నేడు కేంద్రమంత్రి హోదాలో బండి సంజయ్ పార్లమెంటు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు బండి సంజయ్ కుమార్ మరిన్ని పదవులు అలంకరించాలని జిల్లా అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎండి సమీపర్వేజ్ , బషీరోద్దీన్, తాజ్, బల్వీర్ సింగ్ , సాబీర్, సయ్యద్ చిస్తీ , సమీ ఉల్లా అహ్మద్ , సోనూ , ఫసి , ఆమీర్ , మహిళా మోర్చా నాయకురాలు ఫిర్దోస్ తదితరులు పాల్గొన్నారు.