*కేంద్ర స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కేంద్ర బృందం పర్యటన*
*కేంద్ర బృంద సభ్యులు దురిశెట్టి మంజుల పూసాల రజిత ఎస్ బి ఎం కోఆర్డినేటర్లు వేణు రమేష్*
*జమ్మికుంట జూలై 11 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్, వావిలాల గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కేంద్ర బృందం శుక్రవారం రోజున పర్యటించింది గ్రామాల్లో ఉన్న పారిశుధ్య, తాగునీటి వసతులను పరిశీలించి గ్రామాల్లో తడి చెత్త పొడి చెత్త సేకరణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణంపై సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎంపీడీవో బాదావత్ వెంకటేశ్వర్లు, కేంద్ర బృందం సభ్యులు దుర్షెటి మంజుల, పూసాల రజిత, ఎస్బీఎం కోఆర్డినేటర్లు వేణు, రమేష్, ప్రత్యేకధికారులు రమ, ఎన్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు గుర్రం రాము, ఇంగ్లే రాజు, ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.