స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
హైదరాబాద్
ప్రశ్న ఆయుధం
జూలై 11
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో వివిధ సంఘాల బీసీ నాయకులు ముఖ్యమంత్రి ని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు.
సంబంధిత చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్ కృష్ణయ్య తో పాటు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ టి జి ఎం డి సి చైర్మన్ ఈరవత్రి అనిల్ , బీసీ సంఘాల ఇతర నాయకులు పాల్గొన్నారు.