*బెల్లంపల్లి: సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సేవలు*
బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఈనెల 15 నుంచి ప్రత్యేక వైద్యులు వారంలో రెండు రోజులు సేవలందించినట్లు డిప్యూటీ సీఎంఓ మధుకర్ తెలిపారు.
ప్రతి మంగళవారం ఆర్థోసర్జన్, కీళ్ల వైద్యులు, మానసిక వైద్యులు, ప్రతి గురువారం గైనకాలజిస్ట్, చర్మవ్యాధుల నిపుణులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.