పూర్ణ పాడు లాబే సు వంతెన పెండింగ్ పనులు విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు యొక్క వైఖరి వెంటనే ప్రజలకి విషయాన్ని తెలియజేయాలి
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 12 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు
నేటికి 19 సంవత్సరాలు కాలం లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ వంతెన విషయంలో పాలకులు అధికారంలో ఉంటే ఒకలా??? ప్రతిపక్షంలో ఉంటే ఒకలా??? మాట్లాడుతూ పని జరపడంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి
సిపిఎం పార్టీ మిగతా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేసినప్పుడే ఈ వంతెన గురించి టెండర్లవుతున్నాయి త్వరలో పెండింగ్ పనులు ప్రారంభిస్తామని చెప్పుతూ మిగతా సమయంలో ఈ వంతెన అధికారులకు గుర్తు రాని పరిస్థితి ఉంది
జూన్ నెలలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక విధాలుగా అనేక దపాలుగా ఆందోళన చేసిన నేపథ్యంలో అటు పాలకులు ఇటు అధికారులు నిధులు విడుదలయ్యవి కానీ టెండర్ కి ఎవరు రావట్లేదు పిలుస్తున్నామని చెప్పడమే తప్ప టెండర్లు అయ్యేది లేదు పని ముందుకు వెళ్లే పరిస్థితి లేదు
ఈ వంతెన పనులు కోసం ఐదు కోట్ల 50 లక్షలు మంజూరయ్యావని జూన్ నెలలో టెండర్లకి పిలుస్తామని అటు పాలకులు ఇటు అధికారులు చెప్పినప్పుడు కూడా ఇంతవరకు ఏమయింది అనే విషయం ప్రజలకు తెలియజేయకపోవడం చాలా అన్యాయం
ఇలాంటి సందర్భంలో ఈరోజు అనగా శనివారం కూనేరు సంతలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భముగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి గిరిజన సంఘం నాయకులు చెం బురు మరియు నాగేశ్వరరావు నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కొమరాడ మండలానికి సంబంధించి తొమ్మిది పంచాయతీలు 42 గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన ఈ వంతెన నేటికి 19 సంవత్సరాలైనా పని పూర్తి చేయకపోవడం చాలా అన్యాయం కాబట్టి ఈ పూర్ణపాడు ల్యాబే సువంతెన 2006లో ప్రారంభించి నేటికీ 19 సంవత్సరాలు అయినా పూర్తికాని నేపథ్యంలో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనేముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఈ వంతెన పెండింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పి నేటికీ సంవత్సరం అవుతున్న ఒక్క అడుగు పని జరగని పరిస్థితి ఉందని కేవలం టెండర్లకు పిలుస్తున్నాము డబ్బులు ఉన్నాయని చెప్పడమే తప్ప టెండర్లు అయ్యావా ???లేదో??? తెలియదు డబ్బులు విడుదలయ్యాయి అని అధికారులు చెప్పడమే తప్ప ఈ పనులు కి మోక్షం లేదని ఇలాంటి సందర్భంలో గత నెల ఐదు కోట్ల 50 లక్షలు రూపాయలు నిధులు మంజూరు అయ్యావని పాలకులు అధికారులు చెప్పడం జరిగిందని కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల చేస వెంటనే టెండర్లు కి పిలవాలని ఇలాంటి సందర్భంలో నేటికీ టెండర్లకి పిలిచారా లేదా పిలిస్తే ఎవరు వచ్చారా లేదా ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు అనే విషయం అటు పాలకులు గాని ఇటు అధికారులు కానీ ప్రజలకు తెలియజేయడంలో జాప్యం జరుగుతుందని కాబట్టి ఇలాంటి సందర్భంలో వెంటనే టెండర్లు ఖరారు చేసి వంతెన పెండింగ్ పనులు ప్రారంభించాలని ఇలాంటి సందర్భంలో ఈ వంతెన పనులు వేగవంతం చేయాలని ఈ నెల నాగవల్లి అవతల సచివాలయం వద్ద ఆందోళన చేస్తామని తర్వాత ప్రజలతో కలిసి కొమరాడ తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేద్దామని ఈ సందర్భంగా అధికారులకి పాలకులకు తెలియజేయుచున్నాము కాబట్టి వెంటనే అటు పాలకులు ఇటు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి ఈ వంతెన పనులు వేగవంతంగా చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అటు పాలకులకు ఇట అధికారులకు ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో గిరిజన యువకులు పాల్గొన్నారు