తప్పు చేస్తుంటే ప్రభుత్వానికి సహకరించాలా?: శ్రీనివాస్ గౌడ్
Jul 12, 2025,
తెలంగాణ : ప్రభుత్వానికి సహకరించాలని అంటున్నారని.. తప్పు చేస్తుంటే కూడా సహకరించాలా? అని BRS నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై BRS నేతలకు అవగాహన లేదంటున్న కాంగ్రెస్ నేతలు.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్సు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తాము మొదటి నుంచి ఎలాంటి చిక్కులు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కేశవరావు ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదన్నారు.