జ్యువెలర్స్ షాప్ లో రెండు తులాల బంగారం నాలుగు కిలోల వెండి అపహరణ

*జ్యువెలర్స్ షాప్ లో రెండు తులాల బంగారం నాలుగు కిలోల వెండి అపహరణ*

IMG 20250712 WA0055 1షాపు యజమాని ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు*

*ఏసిపి మాధవి సిఐ రామకృష్ణ*

*జమ్మికుంట జూలై 12 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ధనాల కొండయ్య కాంప్లెక్స్ లో గల బ్రాండ్ కళ్యాణి జువెలర్స్ షాపులో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు షాపు యజమాని భోగి వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుకాణంలో నాలుగు కిలోల వెండి ఆభరణాలు రెండున్నర తులాల బంగారాన్ని దొంగలించినట్టు యజమాని తెలిపారు వివరాల్లోకి వెళితే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన భోగి వంశీకృష్ణ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల ధనాల కొండయ్య కాంప్లెక్స్లో బ్రాండ్ కళ్యాణి జువెలర్స్ షాప్ ను నడుపుతున్నట్లు తెలిపారు రోజువారీగా షాపును సాయంత్రం ఏడున్నరకు క్లోజ్ చేసి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు షాప్ వద్దకు వచ్చేసరికి షాపు యొక్క తాళాలు పగలగొట్టి ఉన్నట్లు పేర్కొన్నారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కరీంనగర్ క్రూజ్ టీం ఆధారాలతో సేకరిస్తున్నట్లు సిసి కెమెరాలు ఆధారంగా దొంగలను పట్టుకోవడం జరుగుతుందని ఏసిపి మాధవి సిఐ రామకృష్ణ తెలిపారు

Join WhatsApp

Join Now