ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు భరోసా గా నిలుస్తున్న 114వ డివిజన్ యువ నాయకుడు

*ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు భరోసా గా నిలుస్తున్న 114వ డివిజన్ యువ నాయకుడు*

ప్రశ్న ఆయుధం జులై12: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని 114వ డివిజన్‌ పరిధిలో ప్రజల మద్ధతు మీదే ఎదుగుదల సాధిస్తున్నరు యువ కాంగ్రెస్ నాయకుడు శివ చౌదరి. నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటూ, సమస్యలు ఎదురైన ప్రతిసారీ “నేనున్నా” అనే నినాదంతో ముందడుగు వేస్తున్నారు. ప్రజా సేవకే ప్రాధాన్యత ఇస్తూ, రాజకీయ ప్రయోజనాలకంటే మానవీయ విలువలకు పెద్దపీట వేస్తున్న ఆయన ఇటీవల మరొకసారి తన పెద్దమనసును చాటుకున్నారు. ఇటీవల యువ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రణతి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న శివ చౌదరి, వారి నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అవసరమని గుర్తించి, రూ.10,000 సాయం అందజేశారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కనిపిస్తూ, మాటలకంటే చర్యలతో ముందుంటూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు.

ఇంతకుముందు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న దళితి రత్న అవార్డు గ్రహీత, ఎస్సీ ఎస్టీ ప్రెసిడెంట్ బాబ్జీ కుమార్‌కు హాస్పిటల్‌లో అత్యవసరంగా రూ.1,42,000 తన సొంత డబ్బుతో చెల్లించి, ఆసుపత్రిలో తగిన చికిత్స జరిగేలా చూసి కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. ఈ విషయం పెద్దగా బయటపడకుండా, ప్రచారానికి దూరంగా ఉండే శైలిలో ఆయన సహాయాన్ని అందించారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకతీతంగా సహాయ హస్తం అందించడంలో శివ చౌదరి ముందుంటారు. సేవ కోసమే రాజకీయం అనిపించేలా ఆయన ఎదుగుతున్నారు. నియోజకవర్గంలో ‘నేనున్నా నీకు’ అనే మాటే ప్రజల నోళ్లలో నానుతోంది. క్రమంగా యువతలో విశ్వాసం పెంచుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెంచేలా తన పాత్రను బలంగా నిలబెట్టుకుంటున్న ఆయన సేవా కార్యక్రమాలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now