పేకాట కు అడ్డగా మారిన పల్లె ప్రకృతి వనం
ప్రశ్న ఆయుధం 13 జూలై ( బాన్సువాడ ప్రతినిధి )
నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి శివారులో సోమలింగేశ్వర ఆలయం వెనుకాల గల పల్లె ప్రకృతి వనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది.పోలీసుల నిఘా లేకపోవడంతో పేకాట రాయుళ్లకు మందు బాబులకు అడ్డగా మారినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ ప్రాంతంలో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.