” ఉద్యోగ మేళాను నిరుద్యోగులందరు సద్వినియోగం చేసుకోవాలి – సత్యం శ్రీరంగం. ”
ప్రశ్న ఆయుధం జులై13: కూకట్‌పల్లి ప్రతినిధి
” అందరికి అన్ని రంగాలలో అవకాశాలు కల్పస్తుంది హైదరాబాద్ నగరం – టీపీసీసీ అధికార ప్రతినిధి, ఎస్ఈఏ జాతీయ అధ్యక్షులు సత్యం శ్రీరంగం. ”
సనాతన ఎంట్రప్రెన్యూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువజన విభాగం వారు ‘ యువ ధ్వని 2025 ఉద్యోగ మేళా ‘ హైటెక్ సిటీ లోని సైబర్ గార్డెన్స్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ అధికార ప్రతినిధి, శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్, ఎస్ఈఏ జాతీయ అధ్యక్షులు సత్యం శ్రీరంగం హాజరయ్యారు. 40 కంపనీల ప్రతినిధులు స్టాల్స్ ను ఏర్పాటు చేసారు. ఈ ఉద్యోగ మేళాకు దాదాపు 1500 మంది నిరుద్యోగులు హాజరైనారు, అన్ని స్టాల్స్ ను పరిశీలించి వివిధ కంపనీల ప్రతినిధులతో మాట్లాడి, ప్రోత్సహించి కొంతమందికి ఉద్యోగాలలో అవకాశం వచ్చినవారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమమంలో సీ వ్యవస్థాపకులు ముళ్లపూడి అమ్రిత్, యువజన విభాగంప్రధాన కార్యదర్శి గౌతమ్ వలివేటి,
యువ ధ్వని ప్రతినిధులు శ్రీమతి యామిని కాళీమాత, చంద్ర కాళీమాత, పవన్ తివారి, సత్య రాయప్రోలు, చంద్ర మౌళి, ప్రసన్న హరి, శరన్ కందాల, ఎస్ఈఎ సభ్యులు, యువజన విభాగం, వివిధ కంపెనీల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.