*యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు…*
*ప్రశ్న ఆయుధం,జులై 13 శేరిలింగంపల్లి,ప్రతినిధి*
సాయిరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారం,బిగ్ టీవీ సౌజన్యంలతో.. మియాపూర్ 108 డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్
మియాపూర్ డివిజన్ పరిధిలోని సాయి రామ్ నగర్ కమ్యూనిటీ హాలు ,జేపీ నగర్ నందు సిద్ధార్థ హాస్పిటల్స్,జెన్ హాస్పిటల్స్,పిక్సెల్ ఐ హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు.ఈ మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిధిగాశేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ,కంటెస్టెడ్ ఎమ్మెల్యే మువ్వ సత్యనారాయణ పాల్గొన్నారు. యలమంచి ఉదయ్ కిరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గా మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ గా సేవలందిస్తూ సామాజిక సేవ పట్ల నిబద్ధతతో, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తు ప్రజల మన్ననలు అందుకుంటున్న మియాపూర్ కి చెందిన యువ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ , ఇటీవల రెండు ప్రతిష్టాత్మక జాతీయ గౌరవాలను అందుకుని తెలంగాణకు, మియాపూర్‌కు గర్వకారణంగా నిలిచారు.
సేవా ప్రస్థానంలో కీలక కార్యక్రమాలు:
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, జ్యామితీ బాక్సులు పంపిణీ.. చలివేంద్రాలు మియాపూర్ డివిజన్లో వేసవిలో ఉచిత తాగునీరు, వృద్ధాశ్రమాల్లో పండ్ల పంపిణీ – పోషకాహార పరిరక్షణ మెగా మెడికల్ క్యాంపులు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, అనాథ ఆశ్రమాల్లో ఆహార పంపిణీ ఆరోగ్యకరమైన భోజనాలు, వికలాంగుల కోసం ప్రత్యేక అవసరాలు అవసరమైన సామగ్రి పంపిణీ,
ఆహారంతో పాటు పుస్తకాలు – వికలాంగుల కోసం జీవనోపాధి, విద్యా మద్దతు,యువత కోసం క్రీడా ప్రోత్సాహం – అవార్డులు, క్రీడా కిట్లు పంపిణీ,
వాలీబాల్, కేరమ్ బోర్డులు పంపిణీ – వినోదం కోసం ఆట పరికరాలు, ఉచిత మందుల పంపిణీ – అవసరమైన వారికి ఆరోగ్య సహాయం, బెడ్ షిట్ ల పంపిణీ – హైజీన్, సౌకర్యం కోసం,
దృష్టి పరీక్షల శిబిరాలు – ఉచిత కంటి పరీక్షలు, కన్సల్టేషన్,పేద విద్యార్థులకు ఫీజు సహాయం – విద్యను కొనసాగించేందుకు మద్దతు, కాలెండర్ విడుదల పంపిణీ – సంఘీకతకు మార్గదర్శకంగా మహిళా దినోత్సవ వేడుకలు – ప్రేరణాత్మక మహిళలకు గౌరవం, గ్రేస్ అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం – ప్రేమను ఆహార రూపంలో పంచడం,జి హెచ్ ఎం సి కార్మికులకు ఫుడ్ డ్రైవ్ – ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కృతజ్ఞత,
సమ్మర్ కూలింగ్ స్టేషన్లు – ప్రతీ వేసవిలో విశ్రాంతి కేంద్రాలు, అనుబంధ గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు – వెనుకబడిన ప్రాంతాలకు వైద్య సేవలు
యలమంచి ఉదయ్ కిరణ్ ఛారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ప్రజల హృదయాలను తాకుతూ, మియాపూర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతును పొందుతున్నాయి. అటు రాజకీయ రంగంలో కూడా అందరూ మన్ననలు పొందుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గొప్ప పరిణామం అని,ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులను అభినందించారు. యలమంచి ఉదయ్ కిరణ్ తన టీం సభ్యులు వారి సేవలను ఇంకా విస్తృత పరిచి మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఎంతో మంది వ్యాధిని గుర్తించలేక వైద్యానికి దూరమవుతూ అనేక రోగాల బారిన పడుతున్నారని,రోగికి వచ్చిన వ్యాధిని గుర్తించలేక హాస్పిటల్‌కి వెళ్లే స్థోమత లేక దుర్భరమైన జీవితం గడుపుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని అలాంటి వారి కోసం యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం అని,నిర్వాహకులను,వైద్యులను అభినందించారు..అనంతరం యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ లో వివిధ రకములైన సేవా కార్యక్రమాలకి నాకు సహకరించి ప్రోత్సహిస్తున్న ముఖ్య అతిథిగా విచ్చేసిన శేరిలింగంపల్లి నియోజాక వర్గ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ కి ,కంటెస్ట్ ఎమ్మెల్యే మువ్వ సత్యనారాయణ కి మా టీం తరుపున వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా సాయిరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.సుమారుగా 500 లమంది వివిధ ఆరోగ్య పరీక్షలు ఈ క్యాంపులో చేయించుకున్నారు.ఈ కార్యక్రమంలో సాయిరాం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎంబీ షా,రోజా,గోపరాజు శ్రీనివాస్,భాస్కర్ రెడ్డి ,నరేందర్ రెడ్డి,మరియు నాయకులు నల్ల సంజీవ్ రెడ్డి,వీరమల్ల వీరేందర్ గౌడ్,బాలింగ్ యాదగిరి గౌడ్,పద్మిని ప్రియదర్శిని,మన్నేపల్లి సాంబశివ రావు,మోహన్ ముదిరాజ్,ఆకుల లక్ష్మణ్ ,శేఖర్ రెడ్డి,మహేందర్ ముదిరాజ్,డిసిసి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అభిషేక్ గౌడ్,మిరియాల ప్రీతం,రాంచందర్ గౌడ్,శిరీష సత్తూరి,లక్ష్మినారాయణ,శివనాగరాజు,గోపి,సుబ్బు,గౌతమ్,భాగ్యలక్ష్మి,శ్రీదేవి,జయ,సత్య రెడ్డి , బి.ఎస్.ఎన్ సాయి యాదవ్,రవికుమార్, లక్ష్మీనారాయణ,వాసు,శ్రీనివాస్,భరత్ ,రాంచందర్,బాలకృష్ణ,భరత్,సుధీష్,శరత్,కృష్ణ,వంశీ,ప్రవీణ్,చారి,ఎంఆర్కేచౌదరి,జాహ్నవి,నాని,సుధీష్,రమేష్,జగదీష్,వినోద్,వినయ్,శ్రీకాంత్,మధు,సాంబశివరావు,సదానంద్,ప్రణీత్,శివ,చరణ్,కిరణ్,నాగసాయి,రాజేష్,రామ్,ప్రవీణ్,రాంబాబు,సత్యం,చిరంజీవి,సింహ,తులసి,అభిజిత్,శ్రీనివాస్,నవీన్,బాలమురళి,శేషు,రవీంద్ర,సత్య తదితరులు భారీ స్థాయి లో పాల్గొన్నారు.