*బోడుప్పల్లో ‘ఇందిరమ్మ ఇండ్ల’ను పరిశీలించిన వజ్రేష్ యాదవ్: త్వరగా నిర్మాణాలు పూర్తిచేయాలని హామీ*
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ప్రశ్న ఆయుధం జూలై 13
మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదివారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24, 25వ డివిజన్లలో ‘ఇందిరమ్మ ఇండ్ల’ స్థితిగతులను పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆయనతో పాటు బోడుప్పల్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ పోగుల నర్సింహరెడ్డి, మున్సిపల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ – “సొంతిల్లు కలగాలని ప్రతి పేద కుటుంబం కలగంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కలను నిజం చేస్తోంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించిన ఈ విషయంలో, మేము బాధ్యతగా, సంకల్పంతో పనిచేస్తున్నాం. నిర్మాణాలు త్వరగా పూర్తి చేస్తే ప్రభుత్వం నుండి చెక్కుల పంపిణీని సత్వరమే పూర్తిచేస్తామని హామీ ఇస్తున్నాం” అని తెలిపారు.
కాలనీ నివాసితులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న వజ్రేష్ యాదవ్, “సన్న బియ్యం ద్వారా పేదవాడికి తిండిని అందించగలిగాం. వానాకాలం సీజన్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎవ్వరూ ఇల్లు లేకుండా ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళలకు ఆర్థికంగా స్థిరత్వం కలిగించి, కోటీశ్వరులుగా చేయాలన్న సంకల్పంతో పథకాలు అమలు చేస్తున్నాం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ బీ-బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు రాపోలు రాములు, బోడుప్పల్ నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విశ్వం గుప్తా, మాజీ కార్పొరేటర్లు బొమ్మక్ కళ్యాణ్ కుమార్, జక్కుల పద్మా రాములు, గుర్రాల రామా వెంకటేష్ యాదవ్, రసాలు వెంకటేష్ యాదవ్, లింగపల్లి వెంకటేష్ గౌడ్, దానగళ్ళ యాదగిరి, తూర్పాటి యాదయ్య, ఇతర సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.