బ్యాటరీ సైకిల్ సిద్దూని అభినందించి, సత్కరించిన ఎమ్మెల్యే బేబీ నాయనా

బ్యాటరీ సైకిల్ సిద్దూని అభినందించి, సత్కరించిన ఎమ్మెల్యే బేబీ నాయనా

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 13 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తమహేశ్వరరావు

బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలం, జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన రాజాపు సిద్ధూ తన వినూత్న ఆలోచనలతో తక్కువ ఖర్చులో రూపొందించిన బ్యాటరీ సైకిల్ ను తయారుచేశారు.. ఈరోజు సిద్ధూని బొబ్బిలి కోటకు పిలిపించి, ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) అభినందించి, సత్కరించారు.. తన ఆలోచనలకు మరింత పదునుపెట్టి, ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్రశంసిస్తూ కొంత ఆర్ధిక సహాయం చేశారు.

ఎమ్మెల్యే బేబీనాయన తో సిద్ధూ మాట్లాడుతూ, తమ గ్రామం వ్యవసాయ ఆధారిత గ్రామమని, ఉన్న ఒక్క చెరువులో నీటిని వాడుకుంటూ దాదాపు 40 ఎకరాల భూమిని రైతులు సాగు చేసుకుంటున్నారని తెలిపి..*ఎమ్మెల్యే తమ గ్రామ వ్యవసాయ భూమిలో రెండు బోరుబావులను నిర్మించి సోలార్ ద్వారా విద్యుత్ సదుపాయం* కల్పిస్తే, రైతులు రెండవ పంటను పండించుకునే అవకాశం ఉంటుందని కోరారు.. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బేబీనాయన , వీలైనంత త్వరగా వారి గ్రామానికి సాగునీరు ఏర్పాటు చేసేలా చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సిద్ధూ పెదనాన్న నేతేటి రామారావు బంధువులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.!

Join WhatsApp

Join Now