పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
కామారెడ్డిజిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 13
– 51 సంవత్సరాల తర్వాత కలయిక
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాలలో 1973 – 74 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు 51 సంవత్సరాల తర్వాత తమ కలయికను జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్లో ఏర్పాటు చేసుకున్నారు. తమ పదవ తరగతి చదివిన తర్వాత ఉన్నత చదివి కొందరు ఉద్యోగాలలో, మరికొందరు వ్యాపారాలలో స్థిరపడి తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారికి పెండ్లిలు చేసి విశ్రాంతిగా ఉన్న సమయంలో కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కలయికలో ఒకరికొకరు తమ కష్టసుఖాలను పంచుకొని రోజంతా ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కలుసుకున్న పూర్వ విద్యార్థులలో కుసుమ బాలకిషన్, సిహెచ్ వెంకట్ రాజయ్య, గోవిందులాల్, దిగంబర్, చంద్రకాంత్, యాద రమణారావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.