బోనాల జాతర కు సంతోషం గా సాకలు పోసి బాగా చేసారు..
ప్రతి సారి చేసినట్టే ఈ సారి కూడా పొరపాటు చేసారు..
ప్రతి సంవత్సరం చెబుతున్న..
నా బిడ్డల ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను..
నా పూజలు అన్ని సక్రమంగా జరిపించాలి..
వేల రాసులు నేను రప్పించుకుంటున్న…
నాకు రక్తం బలి ఇవ్వడం లేదు..
మీరు మాత్రం ఆరగిస్తారు.. నాకు మాత్రం ఇవ్వడం లేదు….
నాకు సరిగ్గా పూజలు చెయ్యకపోతే రక్తం కక్కుకొని చస్తారు..
నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు..
అందుకే మరణాలు పెరుగుతున్నాయి..
నేను అస్సలు ఆ విషయం లో అడ్డుపడను..
నాకు రక్తం బలి కావాలి…
నన్ను కొలిచే వారి కి నేను ఎప్పుడు తోడు గా నిలబడుతాను..
రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది ప్రజలు జాగ్రత్త ఉండాలి..
అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతాయి..
ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయి..
ఐదు వారాలు పాటు నాకు పూజలు, సాక పోసి ఆనంద పరచాలి..
నాకు రక్తం చూపించండి లేకపోతే అల్లకల్లోలం జరుగుతుంది..
నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు.