అమెరికాలో 8 మంది భారతీయులు అరెస్టు

*అమెరికాలో 8 మంది భారతీయులు అరెస్టు*

*Jul 14 2025*

అమెరికాలో 8 మంది భారతీయులను హింస, కిడ్నాప్ కేసుల్లో అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ పవిత్తర్ సింగ్ బటాలా కూడా ఉన్నాడు. కాలిఫోర్నియాలో బెదిరింపుల కేసులపై వీరిని అదుపులోకి తీసుకుని, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ 8 మందిపై భారత్‌లోనూ కేసులు ఉన్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now