వైన్ షాపులలో టెండర్లు లేకుండా వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలి 

వికలాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

 

– వైన్ షాపులలో టెండర్లు లేకుండా వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలి

 

– వికలాంగులకు వివాహ ప్రోత్సాహ బహుమతులను ఐదు లక్షలకు పెంచాలి

 

– వికలాంగుల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలి

 

– ఆగస్టు 13న వికలాంగుల గర్జనను విజయవంతం చేయాలి

 

– వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 14

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునీ మేము మాట తప్పమనే విధానాన్ని నిరూపించుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయాధ్యక్షురాలు సుజాత సూర్యవంశం అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అత్యధిక గృహంలో ఏర్పాటు చేసిన అఖిల పక్షాల కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ అభివృద్ధి కోసం ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలు వాటి అమలకు ఇచ్చిన అమీల విషయంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి గతంలో ప్రభుత్వం పెండింగ్లో ఉన్న అంశాల అమలుకై పోరాటం మొదలుపెట్టిందన్నారు.వైన్ షాపులలో టెండర్లు లేకుండా వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలి, వికలాంగులకు వివాహ ప్రోత్సాహ బహుమతులను ఐదు లక్షలకు పెంచాలి,

వికలాంగుల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు.

ప్రభుత్వం ఏర్పడి 18 నెలలకు ఆవస్తున్నప్పటికీ అన్ని అవయవాలు ఉండి ఏదో ఒక పని చేసుకుని జీవించగల వర్గాలకు ఏదో విధంగా మీకు వీలైనంతవరకు హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment