*ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి*
— BC,SC,ST-JAC సిద్దిపేట జిల్లా కమిటీ*
సిద్దిపేట జిల్లా
(ప్రశ్న ఆయుధం) జులై 14
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 90% విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలకు దూరంగా నివాసం ఉంటున్న వారు కాబట్టి ప్రతి ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ప్రతి 30 మందికి ఒక బస్సు ఏర్పాటు చేసి స్కూలుకు తీసుకెళ్లాల్సిందిగా, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేట జిల్లా, కలెక్టర్ గారికి రెప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో *బీసీ ఎస్సీ ఎస్టీ JAC జిల్లా నాయకులు పెరుగు అరుణ్ యాదవ్, మహమ్మద్ రఫీ, రమేష్ చారి, బోయిని సదన్, డి.బి.రాజు, రాగట్ల చందు, ప్రసన్న, పరమేశ్వరి, మాంకాలి సురేష్* తదితరులు పాల్గొన్నారు.