జిల్లానుండి మొదటి సారి (2) ఉత్కృష్ట సేవ పతకాలకు (1) అతి ఉత్కృష్ట సేవ పతకానికి ఎంపిక.*

*జిల్లానుండి మొదటి సారి (2) ఉత్కృష్ట సేవ పతకాలకు (1) అతి ఉత్కృష్ట సేవ పతకానికి ఎంపిక.*

 

 

కామరెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 17

 

*• విలువైన ప్రాణాలను కాపాడారు ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికైనారు.*

*• ప్రాణాలను కాపాడిన మూడు నెలల లోపే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉత్కృష్ట పోలీస్‌ పతకాలను అందుకున్న ఇరువురు జిల్లా హోంగార్డ్స్*

*• 31 సం.ల నిబద్ధత కలిగిన విధులకు ఒక అతి ఉత్కృష్ట సేవా పతకo.*

ఉత్కృష్ట & అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికైన హోంగార్డ్స్ ను అభినందించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

*ఉత్కృష్ట సేవా పతకo:*

1. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చెరువులోకి దూకి సుమారు చెరువు మద్యలోకి వెళ్ళి ఆత్మహత్య ప్రయాత్నం చేసిన మహిళను సురక్షితంగా రక్షించిన పిట్లం బ్లూ కోర్ట్ హోం గార్డుS.మారుతి.

 

2. కామారెడ్డిలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యయత్నం చేసిన మహిళను సమయస్ఫూర్తితో కాపాడిన హోం గార్డు, వసంత్.

*అతి ఉత్కృష్ట సేవా పతకo* :

3. నిబద్ధతతో గత 31 సంవత్సరాలుగా పోలీస్‌ శాఖలో ఉత్తమ సేవలందిస్తున్న ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న హోం గార్డ్ డి. మల్లికార్జున్ ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ

కామారెడ్డి జిల్లాలోని హోంగార్డ్స్ సేవలను గుర్తించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పతకాలను ప్రకటించడం జిల్లాకు గర్వకారణం. ఇది పోలీస్ శాఖలో సేవా తత్పరతకు ప్రతీకగా నిలుస్తోంది అని తెలిపారు.

అదే విధంగా, హోంగార్డు సేవలో ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా ఉత్తమ సేవలు అందిస్తున్న వారితో పాటు, ప్రజల ప్రాణాలను రక్షించిన వారికి ఈ పతకాలు ప్రతి సంవత్సరం ప్రోత్సాహకంగా ఇవ్వబడతాయని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS తెలిపారు.

జిల్లాలో ఉన్న హోంగార్డులు తమ సేవలో నిబద్ధత, విశ్వసనీయత చూపించి, ఇలాంటి గౌరవ పతకాలు మరెన్నో అందుకునేలా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment