వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వకుండా చూసేందుకు తీసుకోవలసిన చర్యలు గురించి చర్చించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

IMG 20250718 WA0277

వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వకుండా చూసేందుకు తీసుకోవలసిన చర్యలు గురించి చర్చించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

ప్రశ్న ఆయుధం జులై18: కూకట్‌పల్లి ప్రతినిధి

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్ హైటెన్షన్ లైన్ వద్ద జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ మరియు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ యాసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)తో కలిసి, వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వకుండా చూసేందుకు తీసుకోవలసిన చర్యలు గురించిం చర్చించి త్వరితగతిన ప్రజలకు మరియు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని చెప్పిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా
కార్పొరేటర్ నర్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మరియు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ యాసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)తో కలిసి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ గా ఏర్పడి, వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్ల బాగోగులు, డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడం వంటి పనులను వేగవంతం చేయాలని సూచించడం జరిగింది అని, అలానే హైదర్‌ నగర్ డివిజన్ లో రోడ్ల నిర్వహణ మరియు గుంతల భర్తీ వంటి పనులను ప్రజలకు మరియు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, హైడ్రా టీం ఎస్ఎఫ్ఓ ప్రవీణ్ , మార్షల్ శ్రవణ్ , సూపర్వైజర్ లు గురు, నరేంద్ర, పృధ్వీరాజ్, నాయకులు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment