ముగ్గురు వ్యక్తులపై పోలీసుల దాడి…

గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

  • ఆత్మకూరు సిఐ సంతోష్ కుమార్

హనుమకొండ జిల్లా ప్రశ్న ఆయుధం

గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని విక్రయిస్తూ ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. మంగళవారం ఆత్మకూరు సిఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలు ఈ ఇలా ఉన్నాయి ఆత్మకూరు మండలం కు చెందిన కక్కు అఖిల్, రాజిరెడ్డి,శాయంపేట మండలం కు చెందిన గోవిందు సృజన్ కుమారులు కలిసి గంజాయిని విక్రయిస్తూ, సేవిస్తున్న విషయాన్ని సమాచారం అందుకున్న పోలీసులు గుడేపాడు సమీపంలోని ఎన్ఎస్ఆర్ హోటల్ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న 50 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు పంపినట్లు సిఐ సంతోష్ కుమార్ తెలిపారు.

Join WhatsApp

Join Now