అమ్మాయి శరీరంపై కమిలిన గాయాలు- పగిలిన లివర్! …హత్య కేసులో వీడని చిక్కుముడులు

*అమ్మాయి శరీరంపై కమిలిన గాయాలు- పగిలిన లివర్! …హత్య కేసులో వీడని చిక్కుముడులు*

గండికోట విద్యార్థిని హత్య కేసులో పోలీసుల దర్యాప్తు మరింత వేగవంతం – శతవిధాలా ప్రయత్నిస్తున్నా కొలిక్కి రాని కేసు విచారణ

కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కేసును ఛేదించడానికి పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. సాంకేతిక ఆధారాలు సేకరించడానికి గండికోటలో హత్య జరిగిన ప్రాంతానికి గురువారం మరోసారి పోలీసు బృందం వెళ్లి ఆధారాల సేకరణలో నిమగ్నమైంది. బుధవారం గండికోటకు వచ్చిన కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఒక ఆధారం లభించిందనీ సాయంత్రానికి కేసు ఛేదిస్తామని చెప్పినా దాని నిర్ధారణ కోసం ఇప్పటికి కూడా పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. సీసీటీవీ దృశ్యాలను మరోసారి అధ్యయనం చేస్తున్నారు.

డాగ్ స్క్వాడ్, పోస్టుమార్టం నివేదికను దగ్గర పెట్టుకొని పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 60 మందికి పైగా అనుమానితులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. యువకుడు లోకేశ్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరోసారి అతని ద్వారా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment