*సొసైటీ పేరిట నమ్మించి మోసం చేసి రూ.50, కోట్ల టోకరా.*
వ్యూహాత్మకంగా 60, మందిని మోసగించిన వైనం..
ప్రశ్న ఆయుధం,జులై 19, శేరిలింగంపల్లి,ప్రతినిధి
ఆదర్శ్ వీకర్ సెక్షన్ సొసైటీ నిర్వాహకులపై సి.సి.ఎస్. లో కేసు నమోదు. భూమి ఉందని నమ్మించి మోసం చేసి రూ 50 కోట్ల రూపాయలకు టోకరా వేసిన మాయగాడు మహా మోసం చేసినట్లు బాధితులు తెలిపారు. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తామ ని రూ.50, కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన వ్యవహారం లో ఆదర్శ్ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఓరుగంటి దుర్గా, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సుబ్బారావు దంపతుల లపై హైదరాబాద్ సి.సి.ఎస్. లో కేసు నమోదై నమోదైనట్లు బాధితులు తెలిపారు. బాధితుల కథనం ప్రకారం బంజారాహిల్స్ కు చెందిన ఓ వ్యక్తి అమెరికా లోని టెక్సాస్లో ఉంటు న్నారు. 2021, ఏప్రిల్ లో తెలిసిన వ్యక్తి ద్వారా గృహనిర్మాణ ప్రాజెక్టు కోసం ఓరుగంటి దుర్గా, ఓరుగంటి సుబ్బారావు ను జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో కలిశారు. తమ సొసైటీ అనేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతోందని, సొసైటీ సభ్యుడిగా చేరితే గచ్చిబౌలిలోని సర్వే నంబరు 37, 40,లోని భూమిలో 500, చద రపు గజాల స్థలం పొందేందుకు అర్హులవుతారని తెలిపారు. సభ్యత్వం కోసం డిపాజిట్ కింద రూ.కోటి కట్టాలని అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సూచించారు. నమ్మిన ప్రవాసుడు డబ్బు కట్టే శాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు దాదాపు 60, మందిని చేర్పించారు. ఆ తర్వాత మరికొందరు చేరేందుకు ప్రయత్నించినా సొసైటీ సభ్యత్వం ముగిసిందని.. దానికి అనుబంధంగా ఉన్న మొబైల్ వెల్ఫేర్ సొసైటీలో చేరాలని చెప్పారు. కొన్నిరోజుల తర్వాత భూమి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి, కోర్టు వివాదాల్లో ఉన్నందున ఆలస్యం జరుగుతోందని నమ్మించారు. బాధితులు 60, మంది
ఇలా 2021, నుంచి 2023, వరకూ భూమి రిజిస్ట్రేషన్, అభివృద్ధి, కోర్టు ఛార్జీల పేరుతో ఆదర్శ్, మొబైల్ సొసైటీ నిర్వాహకులు ప్రవాస భారతీయు డినుంచి మొత్తం రూ.6.46, కోట్లు వసూలు చేశారు. గడువు దాటినా రిజిస్ట్రేషన్ చేయకపో వడంతో డబ్బు వెనక్కివ్వాలని డిమాండ్ చేశాడు. 2024, జనవరి లో రూ.8, కోట్లకు సంబంధించి 2, చెక్కులను ప్రవాసుడికి ఇవ్వగా అవి చెక్కులు బౌన్స్ అయ్యాయి. అనుమానమొచ్చి ఆరా తీయగా మొబైల్ వెల్ఫేర్ సొసైటీకి ఎక్కడా భూమిలేనట్లు తేలిందని. ఆదర్శ్ సొసైటీతో దానికి సంబంధం లేదని, ఓరుగంటి సుబ్బారావు, మొబైల్ వెల్ఫేర్ సొసైటీపై అనేక కేసులున్నట్లు తెలుసు కున్నాడు. మొత్తం 60, మందిని మోసగించి దాదాపు రూ.50, కోట్ల వరకూ వసూలు చేసినట్లు తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సి.సి.ఎస్. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సొసైటీ పేరిట నమ్మించి మోసం చేసి రూ.50, కోట్ల టోకరా.* వ్యూహాత్మకంగా 60, మందిని మోసగించిన వైనం..
by Madda Anil
Published On: July 19, 2025 8:16 pm