ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

*ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్*

ప్రశ్న ఆయుధం,జులై 19, శేరిలింగంపల్లి,ప్రతినిధి

భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ లోగల లింగంపల్లి బస్తీలలో స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొత్తగా డ్రైనేజీ లైన్ల ఏర్పాటుతోపాటు కొత్తగా సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలు, 3 ఫేస్ కరెంట్ సమస్యలను వివరించారు, వెంటనే స్పందించిన కార్పొరేటర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, పాశం రాజు యాదావ్, రాజు, యాదయ్య, కృష్ణ, అజీమ్, సురేష్, ముబీన్, వినోద్, వినయ్, అజామ్, అజ్జు, సాయి, రాజు, చైతన్య, చిన్నబాబు, టీం అబొడ్ అపార్ట్మెంట్ కమిటీ మెంబర్స్, ఎస్ జి టవర్స్ కమిటీ మెంబర్స్, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment