కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గొల్లపల్లి మాజీ సర్పంచ్..
జనగామ జిల్లా:
దేవరుప్పుల మండలం, గొల్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోనేటి సుభాషిని నరసయ్య కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఈసందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో రెండేళ్ల నుండి ఇప్పటివరకు గ్రామ కమిటీలు వేయకపోవడంతో పార్టీలో సమన్వయ లోపం ఏర్పడి గ్రూపులుగా విడిపోయి గ్రూపులలో తమ ని అవమాన పరుస్తున్నారని, కొత్తగా వచ్చిన వారిని కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని పోవడం లేదని ఆత్మగౌరవం కోసం రాజీనామా చేస్తున్నట్లు తమ లేఖ ద్వారా తెలిపారు.