విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..
డెల్టా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 767-400 ఫ్లైట్ ఇంజిన్‌లో మంటలు
లాస్ ఏంజెలిస్ నుంచి అట్లాంటాకు వెళుతున్న విమానం
ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సమస్య
అప్రమత్తమైన పైలట్లు
విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో బోయింగ్ విమానాల్లో సేఫ్టీపై చర్చ జరుగుతున్న వేళ మరో ఘటన చోటు చేసుకుంది. డెల్టా విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ 767-400 ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన కేసేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నుంచి అట్లాంటాకు విమానం బయలుదేరింది. అయితే, ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సమస్య ఎదురైంది.
ఎడమవైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా దిగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? మంటలకు కారణమేంటి? తదితర వివరాలు తెలియాల్సి ఉంది.