సేవాలాల్, జగదాంబ ఆలయ నిర్మాణానికి విరాళం 

సేవాలాల్, జగదాంబ ఆలయ నిర్మాణానికి విరాళం

 

కామారెడ్డి జిల్లాలింగంపేట

(ప్రశ్న ఆయుధం) జులై 20

 

లింగంపేట మండల కేంద్రంలో గల సేవాలాల్, జగదాంబ ఆలయ నిర్మాణానికి ఆదివారం, లింగంపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎర్రబోగడ భీమ్రావు, 50 బస్తాల సిమెంటు,ను విరాళంగా ఇచ్చినట్లు, బంజారా మండల అధ్యక్షులు దేవదాస్ తెలిపారు. ఈ సందర్భంగా భీంరావు మాట్లాడుతూ, ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలు కావున వాటి నిర్మాణం అభినందనీయమని తెలిపారు. ఆలయ నిర్మాణంలో నాకు అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాని తెలిపారు. అనంతరం బంజారా మండల సభ్యులు భీమ్రావుకు శాలువాతో సత్కరించి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి, కృష్ణ, జగ్య నాయక్, శర్మ పంతులు, రాజు, బంజారా నాయకులు గన్ను నాయక్, మోతిలాల్, సర్వన్, నాణ్య నాయక్, బద్రు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment