వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల కమిటీ లను బలోపేతం చేస్తాం.

వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల కమిటీ లను బలోపేతం చేస్తాం.

 

– పెన్షన్ దారుల పట్ల ప్రభుత్వ మోసాన్ని ఎండగడుతాం

 

 

– ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 20

 

అధికారం లోకి వచ్చిన వెంటనే వికలాంగుల పెన్షన్ 6 వేలు,ఇతర చేయూత పెన్షన్ దారులకు పెన్షన్ 4 వేలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చి 18 నెలలు గడిచినా ఇచ్చిన హామీని అమలు చేయకుండా, పెంచిన పెన్షన్ లను ఇవ్వకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని ఇక ప్రజల్లో ఎండగడుతామని అందుకు వికలాంగుల, చేయూత పెన్షన్ దారులను సంఘటితం చేయడానికి కమిటీ లను బలోపేతం చేస్తామని తెలియ జేస్తున్నాం అని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ తెలిపారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజీవ్ నగర్, హారిజనవాడలో వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల సమావేశాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్, మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కాగా, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు రాజనర్సు, శివరాజ్, కుమారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment