*బోనాల పండుగ సందర్భంగా పలు ఆలయాలను సందర్శించిన బిజెపి నేత రవికుమార్ యాదవ్..*
*ప్రశ్న ఆయుధం, జులై 20 శేరిలింగంపల్లి,ప్రతినిధి*
బోనాల పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజక వర్గం ఇంచార్జీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మారబోయిన రవికుమార్ యాదవ్ మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు ఆలయాలను సందర్శించిన అనంతరం మక్తా మహబూబ్ పేట్ లోని పోచమ్మ దేవాలయం ను సందర్శించిన మారబోయిన రవికుమార్ ని ఆలయ కమిటీ వారు శాలువా తో సత్కరించి, అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులచే ఆశీర్వాదాలు వారికి అందజేశారు. అనంతరం ఎం.రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఆలయ కమిటీ సభ్యులకు ధన్య వాదాలు తెలుపుతూ.. పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా అమ్మ దయ అందరి పై ఉండాలనీ, ప్రజల కి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి పార్టీ నేతలు గుండె గణేష్ ముదిరాజ్, శివరాజు, శ్రీను, రాము, బాబు, శ్రీధర్, నరేశ్ , రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
బోనాల పండుగ సందర్భంగా పలు ఆలయాలను సందర్శించిన బిజెపి నేత రవికుమార్ యాదవ్
by Madda Anil
Published On: July 20, 2025 8:56 pm