నిజామాబాద్ మీసేవ కేంద్రాలపై ఆర్డీఓ కఠిన హెచ్చరిక

నిజామాబాద్ మీసేవ కేంద్రాలపై ఆర్డీఓ కఠిన హెచ్చరిక

నిజామాబాద్ కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో, నిజామాబాద్ ఉత్తర మరియు దక్షిణ మండల పరిధిలోని మీసేవ కేంద్ర నిర్వాహకుల సమావేశం శనివారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) రాజేందర్ హాజరై ముఖ్య సూచనలు చేశారు.

సమావేశం నిజామాబాద్ ఉత్తర తహసిల్దార్ విజయ కాంత్ రావ్, దక్షిణ తహసిల్దార్ బాలరాజ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా ఆర్డీఓ రాజేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టిక ప్రకారం మాత్రమే మీసేవ కేంద్రాలు సేవలు అందించాలని స్పష్టం చేశారు. అదనపు రుసుము వసూలు చేసినట్లు ఫిర్యాదు వస్తే, సెంటర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దరఖాస్తులను స్వీకరించే సమయంలో అన్ని దస్తావేజులు, ధృవపత్రాలు సరిచూసి మాత్రమే అప్లోడ్ చేయాలి అని సూచించారు. రేషన్ కార్డుల జారీకి మధ్యవర్తులు జోక్యం చేసుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.

“జాగ్రత్తగా పనిచేసి ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలి” అని ఆర్డీఓ సూచించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఉత్తర, దక్షిణ మండల అధికారులు, మీసేవ ఆపరేటర్లు, యాజమాన్యాలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment