డిగ్రీ కళాశాలలో ఘనంగా బోనాల పండుగ

*డిగ్రీ కళాశాలలో ఘనంగా బోనాల పండుగ*

*జమ్మికుంట జులై 21 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని చాణక్య డిగ్రీ కళాశాలలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలను నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమం లో బాగంగా విద్యార్థిని విద్యార్దులు వివిధ రకాల అమ్మవారి వేషాలతో అలంకరించుకొని బోనాలను అమ్మవార్లకు సమర్పించారు అదేవిధంగా వివిధ నృత్యాలతో సంబరంగా బోనాల పండుగను జరుపుకొని పండగ గొప్పతనాన్ని ఒకరికొకరు పంచుకున్నారు.ఈ కార్యక్రమం లో కళాశాల కరస్పాండెంట్ దబ్బెట విజయ-రవీందర్, డైరెక్టర్లు ప్రభాకర్,శ్రీనివాస్,విజేందర్ రెడ్డి,చిరంజీవి,శివకుమార్ కళాశాల ప్రిన్సిపల్ వంశీకృష్ణ, అధ్యాపక బృందం అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment