124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఫలహారం బండి ఊరేగింపు ఉత్సవాలు

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఫలహారం బండి ఊరేగింపు ఉత్సవాలు

ప్రశ్న ఆయుధం జులై21: కూకట్‌పల్లి ప్రతినిధి

బోనాల పర్వదిన శుభసందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జన్మభూమి కాలనీ, శివమ్మా కాలనీ, ఇంద్రహిల్స్ లో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు ఉత్సవాలకు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిధిగా హాజరై ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా డివిజన్ లోని అన్ని అమ్మవారి ఆలయాలలో కన్నుల పండుగ వాతావరణం లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుపుకోవడం జరిగిందని అన్నారు. డివిజన్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment