కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంత పార్టీ ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే, సామాన్య ప్రజలకు ఎలా రక్షణ ఉంటుంది
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రెండు రోజుల క్రితమే డీసీపీని కలిసి తనకు ప్రాణహాని ఉందని చెప్పాడు.. నిన్న అతని మీద హత్యాయత్నం జరిగిందని పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు
ఈరోజు మంత్రుల అండతో తన మీద హత్యాయత్నం చేశారని అంటున్నాడు.. ఏ మంత్రి అండతో ఎమ్మెల్యే మీద దాడి చేశారు?
ఎమ్మెల్యే మీద దాడి జరిగితే ప్రభుత్వం విచారణ చేపట్టిందా? ఎమ్మెల్యే గన్ మెన్లను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారా?
నిన్న ఎమ్మెల్యే తన మీద దాడి చేశారు, గన్మెన్ల దగ్గర గన్లు లాక్కోవాలని ప్రయత్నించారు అని అన్నాడు.. ఈరోజు ఉస్మానియా పీఎస్ పోలీసులు అలా ఏం జరగలేదు అని అంటున్నారు, అసలు ఇదంతా దీనికి సంకేతం – బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్…