అక్టోబరులో ఉద్యోగుల సాధారణ బదిలీలు!
Jul 22, 2025,
అక్టోబరులో ఉద్యోగుల సాధారణ బదిలీలు!తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. రెండు సంవత్సరాలుగా ఒకే చోట పని చేస్తున్న ఎంప్లాయీస్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే ఫైనాన్స్ శాఖ నుంచి సీఎంఓకు చేరినట్టు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియను వాయిదా వేసిన ప్రభుత్వం, అక్టోబర్‌లో బదిలీలకు శ్రీకారం చుట్టే అవకాశముంది.