పంచాయతీ ఎన్నికలకు కొత్త ఓటర్ల జాబితా!
Jul 22, 2025,
తెలంగాణ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితాను కొత్తగా సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. పంచాయతీలు, వార్డుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి సమాచారంతో జాబితా తయారుచేయాలనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధమవగా.. పంచాయతీలు, వార్డుల సంఖ్య పెంచాలనే డిమాండ్లతో కొత్త ఓటర్ లిస్టు తయారు చేస్తున్నట్లు సమాచారం.