రైతును నట్టేట ముంచిన నకిలీ మొక్కజొన్న విత్తనాలు
మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో నకిలీ మొక్క జొన్న విత్తనాలు కలకలం
గంధంపల్లి గ్రామానికి చెందిన నాయిని వెంకన్న సంతులాల్ పోడు దగ్గర ఏడు ఏకరాల చేను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు
విత్తనాలు నాటి 45 రోజులు అవుతుంది. ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు ఆవేదన
బతుకు దెరువు కోసం కౌలుకు తీసుకొని, భార్య మెడలో పుస్తెల తాడు తాకట్టు పెట్టి లక్ష యాబై పెట్టుబడి పెడితే తమకు నకిలీ విత్తనాలు ఇచ్చి నిండా ముంచారాని అవేదన వ్యక్తం చేసిన బాధితు రైతు కుటుంబం
బంగారం తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టి కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సచ్చే పరిస్థితి వచ్చిందని కన్నీరు మున్నీరు అవుతున్న పేద రైతు కుటుంబం
మాకు న్యాయం చేయకపోతే మా భార్య భర్తలు ఇద్దరం ఇదే పంట చేన్లో మందు తాగి చనిపోతామని ఆవేదన
ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాల అమ్మిన షాప్ పై కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని వేడుకోలు