బిఆరెస్ కార్యకర్తల జోలికి వస్తే ఉరికించి కొడుతాం…ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ఈటెల పెద్ద మోసగాడు…

కేసీఆర్ ని విమర్శించే స్థాయి ఈటల ది కాదు

రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ కాదా…?

అవినీతి తో అక్రమంగా సంపాదిస్తే అతన్ని పార్టీ నుంచి వెల్లగొట్టారు

హుజురాబాద్ గడ్డ కేసీఆర్ అడ్డా

బిఆరెస్ కార్యకర్తల జోలికి వస్తే ఉరికించి కొడుతాం

బీజేపీ లోకి వెళ్లిన ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ లోకి వాపస్ రావాలి

గుడ్లు అమ్ముకునే స్థాయి బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయి కి ఎలా పోయావ్..?

బండి సంజయ్ ట్రాప్ లో పడింది నేను కాదు ఈటలనే

హుజురాబాద్ ప్రజలు ఈటల ను ఎప్పుడో మరచిపోయారు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ జూలై 22 ప్రశ్న ఆయుధం

ఈటల రాజేందర్ పెద్ద మోసగాడని టికెట్ ఇచ్చి అన్నం పెట్టిన కేసీఆర్ తో పాటు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను నమ్ముకున్న కార్యకర్తలతో మోసం చేశాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తాడు. మంగళవారం హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఈటల రాజేందర్ ది కేసీఆర్ ను విమర్శించే స్థాయి కాదని, కెసిఆర్ పెట్టిన భిక్షతో పదవులు పొంది ఇప్పుడు కేసీఆర్ ని విమర్శించడం సిగ్గుచేటు అని ఈటలకు రాజకీయ బిక్ష పెట్టి 2 సార్లు మంత్రిగా చేసిన కేసీఆర్ విమర్శించడం అంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టడమే అవుతుందని దేవుడు లాంటి కేసీఆర్ ను విమర్శిస్తే పుట్టగతులు ఉండవని పేర్కొన్నారు హుజురాబాద్ నియోజకవర్గం లో ఉన్నప్పుడు లేని బీసీల మీద ప్రేమ ఇప్పుడు కొత్తగా ఎలా పుట్టిందని ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీలో ఉండి పార్టీకే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావాలనుకున్న నీ ఆశలను బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిప్పి కొట్టారని పేద ప్రజల నెత్తుటి రక్తాన్ని పీల్చి వందల ఎకరాలు కబ్జా చేస్తే దానిని సహించని కెసిఆర్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టింది నిజం కాదా అని కొడుకు బిడ్డ పేర్లు పక్కన రెడ్డి అని పెట్టుకున్న నీవు బీసీ ఎలా అయితావని ఆయన ప్రశ్నించారు. కమలాపూర్ లో ఉన్న ఈటెల బంధువులను ఏనాడైనా హైదరాబాద్కు తీసుకువెళ్లి కనీసం అన్నం పెట్టావా అంటూ ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ బిసి ముసుగులో ఉన్న దొర అని గుడ్లు అమ్ముకునే స్థాయి నుంచి బంగారు గుడ్లు అమ్ముకొని వరకు ఎలా ఎదిగావని పేర్కొన్నారు హుజురాబాద్ గడ్డ బిక్ష పెడితే షామీర్పేట్ గడ్డ నాది అని ఎలా అంటావాని హుజురాబాద్ నియోజకవర్గం లో నాటి బిఆర్ఎస్ కార్యకర్తలను మభ్యపెట్టి తన వెంట తిప్పుకొని ఇప్పుడు షామీర్పేట్ కి వెళ్లి వాళ్లను నట్టేట ముంచారని ఈటెల వెంట వెళ్లిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధైర్య పడవద్దని బిఆర్ఎస్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని, ఈటలను నమ్ముకొని మోసపోయిన వారంతా తిరిగివస్తే వారికి ఎప్పుడు ఆహ్వానం పలికేందుకు హుజురాబాద్ నియోజకవర్గం లో నేను సిద్ధంగా ఉంటానని తెలిపారు ఈటల రాజేందర్ బిఆర్ఎస్ కార్యకర్తల జోలికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఈటల రాజేందర్ పార్టీలో చేరక ముందే మా నాన్న సాయినాథ్ రెడ్డి, కెప్టెన్ లక్ష్మీ కాంతారావు హుజురాబాద్ నియోజకవర్గం లో అన్ని స్థానాలు గెలిపించాలని గుర్తు చేశారు. హుజురాబాద్ గడ్డ ఎప్పటికీ కెసిఆర్ అడ్డాగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న గ్రామపంచాయతీ మున్సిపల్ అన్ని ఎన్నికలలో హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి పోటీలో బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి తీరుతానని శపథం చేశారు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో వెళితే నన్ను బిజెపిలో కలుస్తానంటూ మాట్లాడటం సిగ్గుచేటు అని అలా అయితే ఇటీవల ఈటెల రాజేందర్ బట్టి విక్రమార్కతో ఒక ఫంక్షన్కు వెళ్లారని అక్కడ దిగిన ఫోటో తను అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశారని అలా అయితే ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్లో చేరుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ ట్రాప్ లో కౌశిక్ రెడ్డి పడ్డారని ఈటెల మాట్లాడుతున్నారని బండి సంజయ్ ట్రాప్ లో పడింది నేను కాదని ఈటలనేనని హుజరాబాద్ నియోజకవర్గం లోని కొన్ని గ్రామాలకు 25 వేల చొప్పున పంపించి తన ఇంటి ముందు ధర్నా చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టుమని 200 మంది కూడా వెళ్లలేదని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం ఈటెల రాజేందర్ ను ఎప్పుడో మర్చిపోయిందని, ఇక హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ కి ఎలాంటి మద్దతు దొరకదని విషయాన్ని మర్చిపోకూడదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన ఘాటుగా స్పందించారు. హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు రెండో విడత వెంటనే అమలు చేయాలని, సుమారు 40000 మంది మహిళలు ఇంద్రమ్మ ఇండ్ల కోసం కోసం దరఖాస్తులు పెట్టుకున్నారని వారందరికీ వెంటనే ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను హుజురాబాద్ లో పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు వదిలిపెట్టేదే లేదని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో బి ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణరావు ఎంపీపీలు రాణి సురేందర్ రెడ్డి తిరుపతి రెడ్డి కన్నూరి సత్యనారాయణరావు మాజీ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్ రాజేశ్వరరావు తక్కలపల్లి, సంగేమ్ ఐలయ్య, రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now